అంగరంగ వైభవంగా జారంపేట వేంకటేశ్వరస్వామికీ భూదేవి శ్రీదేవిలతో కల్యాణం
కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే బక్కనీ నర్సింలు
కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్, అందే బాబయ్య, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్
మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి దంపతులు
సి కే న్యూస్ : ఆగస్టు 19
షాద్ నగర్ పట్టణంలోని జనంపేట దేవాలయం లో కొలువైన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర
స్వామికీ శ్రీదేవి భూదేవిలతో కళ్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.అంగరంగ
వైభవంగా వేంకటేశ్వరస్వామికీ భూదేవి శ్రీదేవిలా కల్యాణంలో స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పిచిన ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి దంపతులు,న్యాయవాది జగన్మోహన్ రెడ్డి దంపతులు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న కల్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు పంచామృతాభిషేకంతో పాటు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేసి అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల మధ్య అంగరంగ వైభవంగా లక్ష్మి వెంకటేశ్వర సాములోరి కల్యాణం కొనసాగుతుంది.స్వామి అమ్మవార్లకు నిత్య తిరు కల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాలు, కరతాళ ధ్వనుల మధ్య అర్చకులు, వేద పండితులు ఉత్సవ మూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపించారు. లక్ష్మీ సమేతుడైన వేంకటేశ్వరుడుని ఆరాధిస్తూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ముల్లోకాది దేవతలు చూస్తుండగా వేంకటేశ్వర స్వామి శ్రీదేవి, భూదేవి మెడలో మంగళ్యధారణ చేశారు.ఆలయ ప్రాంగణం “నమో వెంకటేశాయ, గోవిందా” అనే నామస్మరణతో స్వామి అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకిస్తున్న భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఆనంద పరవశులయ్యారు. మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు, బీజేపీ నాయకులు అందె బాబాయ్య ముదిరాజ్,కేశంపేట మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్, రంగారెడ్డి జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ ముదిరాజ్, షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్,ఈ సందర్భంగా ఆలయంలో వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకుని కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అదేవిదంగా ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, బ్రాహ్మణులు, మహిళలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.