సాగర్ ఎడమ కాలువలో బాలిక గల్లంతు
సికే న్యూస్ వేములపల్లి ఆగస్టు 20
వేములపల్లి మండల కేంద్రంలో సాగర్ ఎడమ కాలువలో బాలిక గల్లంతు ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకెళితే సూర్యాపేట జిల్లా కుసుమ వారి గూడానికి చెందినటువంటి పోతురాజు విజయ లక్ష్మి వారి యొక్క కుటుంబ సభ్యులు
18/8/ 2024 రోజున వేములపల్లి మండలం బుగ్గబాయి గూడెం గ్రామంలో తమ తమ్ముని వివాహానికి వచ్చిన వీరు 19/8/2024 రోజున సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పోతురాజు విజయ లక్ష్మి వారి కుటుంబ సభ్యులు పోతురాజు తేజశ్రీ కూతురు(14),కుమారుడు గోపీచంద్, చెల్లెలు మండుసు రోహిణి, రొయ్య ఎల్లమ్మ, రొయ్య ప్రదీప్
వీరంతా కలిసి వేములపల్లి మండల కేంద్రంలో గల నాగార్జునసాగర్ ఎడమ కాలువ ర్యాంపు ఉన్న ప్రాంతంలో బట్టలు ఉతుకుతుండగా అదే సమయంలో వారి యొక్క పిల్లలు నీటిలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు వారి యొక్క కూతురు (తేజశ్రీ)కాలు జారీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది
ఇది గమనించిన వారు కొంత దూరం కాలువ వెంబడి పరిగెత్తిన కానీ నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో గల్లంతైనటువంటి బాలిక నీటిలో మునిగి కొట్టుకుపోవడం జరిగింది
దీనితో వారి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ కి చేరుకొని బాలిక గల్లంతైన విషయాన్ని పోలీసులకు వివరించి పిటీషన్ ఇవ్వడం జరిగింది దీనిపై స్థానిక ఎస్సై దాచేపల్లి విజయకుమార్ బాలిక గల్లంతైన విషయాన్ని పై అధికారులకు వివరించి వెతుకులాట మొదలుపెట్టారు