కొండాపూర్‌లో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. పోలీసులు విదేశీ యువతులతో ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా ఆర్గనైజ్డ్‌గా వ్యభిచారం చేయిస్తున్న గ్యాంగ్ ఆటకట్టించారు.
కొండాపూర్ ఒక ఇండి పెండెంట్ హౌస్‌లో గుట్టుగా గలీజు దందా సాగుతుం దన్న సమాచారంతో గచ్చి బౌలి, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు చేశారు.
17 మంది విదేశీ యువతులను అదుపులోకి తీసుకుని సేఫ్ హౌస్‌కు తరలించారు. వీరిలో కెన్యా దేశానికి చెందిన 14 మందితో పాటు ఉగాండా, టాంజానియా దేశాలకు చెందిన యువ తులు ఉన్నట్టు గుర్తించారు.
వ్యభిచార ముఠా నిర్వాహకుడు శివ కుమార్‌తో పాటు ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. లోకాంటో అనే వెబ్‌సైట్‌లో యువతుల ఫోటోలు పెట్టి విటులను రప్పిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
స్పాట్ నుంచి 4 మొబైల్ ఫోన్లు, 25 హెచ్ఐవీ కిట్లు, హుక్కా పాట్స్, 20 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వ్యభిచార దందాలపై నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు.