వ్యభిచార గృహాల్లో రాసలీలలు….ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు !
హైదరాబాద్ మహా నగరంలో కానిస్టేబుళ్లు అరాచకాలకు పాల్పడ్డారు. మధురానగర్ పీఎస్ కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. దామోదర్, నాగరాజు, సతీష్ లను సస్పెండ్ చేశారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.
హోం గార్డ్ రాజును పోలీసు శాఖకు చెందిన మోటారు ట్రాన్స్ పోర్ట్ కు వెనక్కి పంపి చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.
స్పా సెంటర్స్ , వ్యభిచార గృహాలనుండి నెలవారీ మామూళ్లు వసూలు చేశారట కానిస్టేబుళ్లు దామోదర్, నాగరాజు, సతీష్. లంచాలతో పాటు అక్కడి యువతులతో ఖాకీల రాసలీలల్లో పాల్గొన్నారట.
స్పా సెంటర్ లోకి ముగ్గురు కానిసేబుళ్లు, హోం గార్డ్ వెళ్లొచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇక ఆ ఆరోపణలన్నీ వాస్తవమేనని తేలడంతో ముగ్గురు కానిస్టేబుళ్ళపై సస్పెన్షన్ వేటు వేశారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.