మనసున్న మహారాజు మన ఫిరోజ్ భాయ్ వరద బాధిత ప్రయాణికులకు భోజనం ఏర్పాట్లు. సెల్ షాప్ యజమాని ఫిరోజ్ కు పలువురి ప్రశంసలు. సీకే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్ ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో టేకులగూడెం వద్ద అంతర్రాష్ట్ర జాతీయ రహదారి వరద నీటితో స్తంభించి పోయింది. రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.భారీ నీటి ప్రవాహంతో కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఈ …

మనసున్న మహారాజు మన ఫిరోజ్ భాయ్

వరద బాధిత ప్రయాణికులకు భోజనం ఏర్పాట్లు.

సెల్ షాప్ యజమాని ఫిరోజ్ కు పలువురి ప్రశంసలు.

సీకే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్

ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో టేకులగూడెం వద్ద అంతర్రాష్ట్ర జాతీయ రహదారి వరద నీటితో స్తంభించి పోయింది. రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.భారీ నీటి ప్రవాహంతో కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది.

ఈ మేరకు జాతీయ రహదారిపై ప్రభుత్వ అధికారులు రాకపోకలు నిలిపి వేసారు. అధికారులు రహదారిపై రాకపోకలు నిలిపివేస్తూ భారీకేట్లు ఏర్పడి చేశారు. రహదారికి ఇరువైపులా వందలాది వాహనాలు ప్రయాణికులు తో నిలిచిపోయాయి.

వారికి మంచి నీళ్లు, ఆహారం లేక అల్లాడుతుండగా, పిల్లలు, వృద్దులు,మహిళలు షేషెంట్లు , పడే బాధలు వర్ణాతీతం. వారి బాధలను చూసి చలించి పోయిన మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో ఏ టు, జెడ్. అనే పేరుతో మొబైల్ షాప్ ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న, ఫిరోజ్ స్వచ్ఛందంగా ప్రయాణికులకు ఆహారం భోజనం అందించాలని ముందుకు వచ్చారు.

హైదరాబాద్ నుండి భూపాల్ పట్నం వెళ్తున్న సుమారు 70 మంది.ప్రయాణికులు సోమవారం అర్ధరాత్రి నుండి టేకులగూడెం అంతర్రాష్ట్ర రహదారి నీటమునగటంతో, ప్రయాణికులు ఆకలితో మంచినీళ్ళు ఆహారం లేక అలమటించారు. స్థానికుల సమాచారం మేరకు, వారికి మంగళవారం స్వచ్ఛందంగా భోజనం ఇతర సదుపాయాలను కల్పించారు. ఏ టు జెడ్ మొబైల్ షాప్ యజమాని ఫిరోజ్ సేవాదృక్పధానికి ప్రయాణికులు అభినందనలు తెలియజేశారు.

రహదారి వరదనీటితో ముంచేసుకోవడంతో రాకపోకలు లేక వాహనాలను నిలిచిపోయిన సుమారు 70 మంది ప్రయాణికులు డ్రైవర్లకు మంచినీళ్లు భోజనం అందించి మానవతా దృక్పథాన్ని చాటిన ఏ టు జెడ్ మొబైల్ షాప్ నిర్వాహకులు ఫిరోజ్ ను పలువురు అభినందించారు.

ఆపద సమయంలో తన వంతు బాధ్యతగా, మానవతావాదంతో సహాయ సహకారాలు అందించడం, ప్రతి ఒక్కరి బాధ్యత దానికి నిదర్శనమే వరద బాధిత ప్రయాణికులకు ఆహారం అందించి, తన సేవా దృక్పథాన్ని సమాజానికి తెలియపరచిన, ఏ టు జెడ్ మొబైల్ షాప్ యజమాని ఫిరోజ్ ను మనసున్న మహారాజు అని పలువురు అభినందనలు తెలిపారు.

Updated On 3 Sept 2024 5:22 PM IST
cknews1122

cknews1122

Next Story