హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల కలకలం
నగరంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు కలకలం రేపుతున్నాయి. వన్ అండ్ ఫైవ్ పార్లర్‌లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించగా, విస్కీ ఐస్‌క్రీమ్‌లు బయటపడ్డాయి.
పిల్లలకు ఐస్‌క్రీమ్‌కు విస్కీ కలిసి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐస్‌క్రీమ్‌లో పేపర్ విస్కీ కలిపి విక్రయిస్తున్నారు. వన్‌అండ్ ఫైవ్ నిర్వాహకులు దయాకర్‌రెడ్డి, శోభన్‌లను అరెస్ట్ చేశారు.
60 గ్రాముల ఐస్క్రీమ్లో 100 మి.లీ విస్కీని కలుపుతున్నారు. ఐస్క్రీమ్ క్రీమ్ విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు.
11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్స్‌ను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 అండ్ 5లో హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్‌లో గుట్టుచప్పుడు కాకుండా విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు.