మర్రి మాకు వాగులో మహిళ మృతదేహం లభ్యం.
పేరూరు పోలీసుల దర్యాప్తు .
సీ కే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామ సమీపంలో మర్రి మాకు వాగులో నీటిపై తేలియాడే గుర్తుతెలియని మహిళ మృతదేహం ను ఆదివారం సాయంత్రం కనుగొన్నారు.
ఈ విషయాన్ని పేరూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, మృతదేహాన్ని వాగు నుండి వెలికి తీశారు.మృతి చెందిన మహిళకు సుమారు 60 సంవత్సరాలు పైబడి ఉంటాయనిఅంచనా.
ఇటీవల గోదావరి వరదలు, భారీ వర్షాలు కారణంగా వృద్ధురాలు ప్రమాదవశాత్తు ప్రవాహంలో పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
ఈ విషయంపై పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి. కృష్ణ ప్రసాద్ ను ఆదివారం సాయంత్రం మీడియా ప్రతినిధులు వివరణ కోరగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం అని మృతురాలి వివరాలు ఈ విధంగా తెలియజేశారు .
ఆమె పేరు కంతి లక్ష్మి వయస్సు 60 సంవత్సరాలు,కులం కోయ, వెంకటాపురం ఎదిరా గ్రామస్తురాలు, కంతి లక్ష్మి తమ చెల్లెలు అయినా చెందురు. బతుకమ్మ (కృష్ణాపురం) వారి ఇంటికి రావడం జరిగింది. ప్రమాదవశత్తు నీళ్లలో పడిపోయింది అని వివరాలు తెలిపారు.