నేడు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు
TG: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. BRS నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై గత నెల 7నే ఇరు పక్షాల వాదనలు పూర్తవ్వగా, కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.