*పాపకొల్లు గ్రామంలో చిట్యాల ఐలమ్మ వర్ధంతి ఘన నివాళి అర్పించిన
*వైరా ఎమ్మెల్యేమాలోత్ రాందాస్ నాయక్
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి
సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ బాధావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామమునందు తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత,తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత,సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి,వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో 1895, సెప్టెంబరు 26న ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది.
వీరిది వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె.
1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ.అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’ అని ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు.
దొరా అని పిలువకపోతే ఉన్నతకులాలతో పాటు వారి అనుంగు ఉంపుడుకత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకు వచ్చేది. వెనుకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి ఆఘాయిత్యం చేయించేవారు.
ఈ భూమినాది… పండించిన పంటనాది… తీసుకెళ్లడానికి దొరెవ్వడు… నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు.. అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ.
ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 న అనారోగ్యంతో మరణించింది.
పాలకుర్తిలో ఐలమ్మ స్మారక స్థూపం, స్మారక భవనాన్ని ప్రజల విరాళాలతో నిర్మాణం చేశారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి 2022 సెప్టెంబరు 22న ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, వెంగన్నపాలెం మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు నున్న రంగారావు, ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు, నర్వనేని పుల్లారావు, ధారావత్ రాంబాబు,పోతురాజు నాగరాజు , లకావత్ లచ్చు నాయక్, పాపకొల్లు మాజీ ఎంపీటీసీ స్వాతి, బాబు, మాచినేని సత్యం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్,మిరియాల కిరణ్ కుమార్, రాంజీ, తోట శ్రీను,రాందాస్ నాయక్, పనితి వెంకటేశ్వర్లు, మాడుగుల నాగరాజు,
రామ్ శెట్టి నాగేశ్వరరావు, కొల్లిపాక వెంకటేశ్వర్లు మండలనాయకులు రోకటి సురేష్ రామ్ శెట్టి రాంబాబు కంచర్ల హరీష్, కళ్యాణపు నరేష్, చిట్టిబాబు, జవ్వాది నాగేశ్వరరావు, ధర్మరాజుల వెంకటనారాయణ, కొదమూరు కోటేశ్వరరావు, తాళ్లూరు అచ్చ, నిమ్మటూరి వీరయ్య, స్వామి, మద్దిశెట్టి వంశీ, భూక్య అనిల్, రఘు, ధరావత్ నాగేశ్వరావు, పూర్ణకంటి నాగేశ్వరావు, పురేటి తిరుపతిరావు, ఆరిగెల నరసింహారావు, రామ్శెట్టి నరేంద్ర, నాగరాజు, నారాయణ, గ్రామస్తులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు