ఎమ్మెల్యే ను సన్మానించిన బాస్ నాయకులు పలమనేరు సెప్టెంబర్ 12 సి కే న్యూస్ పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం నాయకులు పార్టీ కార్యాలయంలో గురువారం కలసి సన్మానించారు. పలమనేరు నియోజకవర్గ బాస్ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సరస్వతి కేఫ్ యజమాని రూపేష్ ఎన్నిక కావడంతో, ఆ సంఘ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసి, సన్మానించారు. భవిష్యత్ లో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల్లో తమ వారికి …

ఎమ్మెల్యే ను సన్మానించిన బాస్ నాయకులు

పలమనేరు సెప్టెంబర్ 12 సి కే న్యూస్

పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం నాయకులు పార్టీ కార్యాలయంలో గురువారం కలసి సన్మానించారు. పలమనేరు నియోజకవర్గ బాస్ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సరస్వతి కేఫ్ యజమాని రూపేష్ ఎన్నిక కావడంతో, ఆ సంఘ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసి, సన్మానించారు. భవిష్యత్ లో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల్లో తమ వారికి సముచిత స్థానం కల్పించాలని వారు కోరారు. పార్టీ కోసం పనిచేసిన వారితో పాటు, సేవా కార్యక్రమాలలో ముందుండే వారికి, వారివారి అర్హతలను బట్టి, నామినేటెడ్ పోస్టులలో అవకాశం కల్పించేందుకు తప్పక కృషి చేస్తానని, ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, ఆ సంఘ నాయకులు అములు, అరుణ్, కోటేశ్వర్, శ్రీధర్, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.

Updated On 12 Sept 2024 2:47 PM IST
cknews1122

cknews1122

Next Story