కన్నకొడుకు బువ్వ పెట్టడం లేదు అంటూ ఓ తండ్రి ఆవేదన…
పెబ్బేరు సెప్టెంబర్23 (సి కే న్యూస్)
ఇద్దరు కుమారులకు ఆరుగురు కుమార్తెలకు జన్మనిచ్చి నవమాసాలు మోసి పెద్ద చేసి పెండ్లిలు చేసిన తల్లిదండ్రులు చిన్న కుమారుడు చనిపోగా పెద్ద కుమారుడే మాకు ఆదారం అనుకోగా వృద్ధులు కావడంతో అన్నం పెట్టకుండా ఉండటమే కాక మానసిక వికలాంగురాలైన తన కూతురుకు ఇచ్చిన భూమిని తన పేరు మీద చేయాలని కొడుతున్నారని జిల్లా ఎస్పీకి,ఆర్డీవోకు విన్నవించుకున్నారు.
ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వృద్ధులు తెలిపిన వివరాల ప్రకారం…వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన వృద్ధుడు కదల మషన్న తన కొడుకు రాములు,మరియు కోడలు అన్నం పెట్టడం లేదని కొడుతున్నారని పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు.
తమకు ఇద్దరు కొడుకులు, ఆరుగురు కూతుళ్ళు ఉండగా చిన్న కుమారుడు చనిపోయాడని అందరిని పెద్ద చేసి పెండ్లిలు చేశానన్నారు.తన పేరు మీద ఉన్న భూమిని కుమారుడు రాములు పేరు మీద చేశానన్నారు. మానసిక వికలాంగురాలైన నా కూతురు పై రెండు ఎకరాలు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను
ఇప్పుడు ఆ పొలం కూడా నాకు కావాలని పెద్ద కుమారుడు రాములు ఇప్పుడు వృద్ధులు కావడంతో తమ పని తాను చేసుకునే పరిస్థితుల్లో తాము లేమని.. తమకు ఇద్దరికీ అన్నం పెట్టడం లేదని, గ్రామంలో ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదని మాకు న్యాయం చేయాలని వారు కోరారు.కుమారుడు కోడలు పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలిపారు