పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి
బంగారం. వెండి. నగదు బీరువా పగలగొట్టి చోరీ చేసిన దొంగలు
బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య సెప్టెంబర్ 24
తెలిసిన సమాచారం మేరకు చౌటపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలం వద్దకు ఉదయం ఇంటికి తాళం వేసి వెళ్లగా తన పనులు ముగించుకొని 11 గం లకు ఇంటికి వచ్చి ఇంటికి వేసిన తాళం తీయడానికి అతను పెట్టిన తాళపు చెవి పెట్టిన దగ్గర లేకపోవడంతో ఇంట్లో వెదకడం ప్రారంభించగా అది వేరే దగ్గర కనబడగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వెంటనే ఇంటి తాళం తీయాగా లోపల ఉన్న బీరువా తాళం పగలగొట్టి ఉండటం జరిగింది
అతనికి అనుమానం వచ్చి వెంటనే బీరువాని పరిశీలించి చూడగా అందులో బంగారు చెవి బుట్టలు వెండి పట్టీలు పదివేలు నగదు దొంగలు అపహరించుకుపోయారని వెంటనే హుటా హుటిన మఠంపల్లి పోలీస్ స్టేషన్లో కుటుంబ యజమాని ఫిర్యాదు చేయడం జరిగిందని పోలీస్ వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మండలంలో వరుస దొంగతనలతో ప్రజలు జంకుతున్నారు.