పబ్ లో ఐపీఎస్ వర్సెస్ డాక్టర్.. తన భార్యను తాకాడని డాక్టర్ పై కేసు
ఐటీ కారిడార్ పరిధిలోని ఓ పబ్ లో ఐపీఎస్ ఆఫీసర్ భార్యను తాకాడాని ఓ డాక్టర్ ను రాత్రంతా స్టేషన్లో కూర్చోబెట్టారు.
తెల్లారి తోటి డాక్టర్లు పీఎస్ కు తరలిరావడంతో వివాదం ఎక్కడికో వెళ్తుందని గమనించి కేసు పెట్టారు. గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని తబుల రస పబ్ కు ఆదివారం రాత్రి ఓ ఐపీఎస్ ఆఫీసరైన కుటుంబంతో సహా వెళ్లాడు.
ఇదే పబ్ కు కొందరు డాక్టర్లు కూడా వచ్చారు. ఐపీఎస్ ఆఫీసర్ భార్య వాష్ రూమ్ కు వెళ్తున్న క్రమంలో డాక్టర్ చెయ్యి ఆమెకు తగిలింది.
పొరపాటు జరిగిందని డాక్టర్ సారీ చెప్పగా.. వినిపించుకోని ఆమె విషయాన్ని తన భర్తకు చెప్పింది.దీంతో సదరు ఆఫీసర్ పోలీస్ సిబ్బందికి ఫోన్ చేసి పబ్ దగ్గరకు రప్పించాడు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించావంటూ డాక్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు.
ఉదయం తోటి డాక్టర్లు పీఎస్ కు వచ్చి తమ డాక్టర్ తప్పేంలేదని, అనుకోకుండా జరిగిన దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారని వాదించారు. దీంతో ఉదయం పబ్ నిర్వాహకులను పిలిపించి డాక్టర్ పై ఫిర్యాదు చేయించి, కేసు నమోదు చేయించినట్టు సమాచారం.దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.