‘నన్ను ప్రేమించాలి’ అని కేకలేస్తూ ఉప్పల్ బస్టాప్ వద్ద యువతిపై దాడి..
ఉప్పల్ బస్టాప్ వద్ద యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధిత యువతికి స్వల్ప గాయాలయ్యాయి.
భువనగిరి చెందిన సాయికుమార్, అతని ప్రేమికురాలు ఇద్దరూ విద్యార్థులు.సిటీలో చదువుకుంటున్న ఈ ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు.
ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ప్రస్తుతం విడిపోయి ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఈ ఇద్దరూ గురువారం (సెప్టెంబర్ 26, 2024) చాలా రోజుల తర్వాత ఉప్పల్ బస్టాప్ దగ్గర కలుసుకున్నారు. కొద్దిసేపు మంచిగానే మాట్లాడుకున్నారు.
ఏం జరిగిందో తెలియదు గానీ ఇరువురికి మాటామాటా పెరిగింది. ”నన్ను ప్రేమించాలి” అంటూ అమ్మాయిపై సదరు యువకుడు కత్తితో దాడి చేశాడు.
ఈ దాడిలో యువతి చేతికి గాయమైంది. చికిత్స నిమిత్తం యువతిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.