PoliticalTelangana

బిజెపి బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలి

బిజెపి బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలి

ఎంపీ ఎన్నికల తరువాత బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది

బిజెపి బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలి

దేశంలోనే రఘువీర్ కు నెంబర్ వన్ స్థానంలో మెజార్టీని ఇవ్వాలి

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటాం

బిజెపి బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతే

పార్లమెంటు సన్నాహక సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కమీషన్ల కోసం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది

రఘువీర్ ను ఆరు లక్షల మెజార్టీతో గెలిపించాలి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

సిమెంటు లేకుండా ఇంటిని ఎలా నిర్మించలేమో కార్యకర్తలు లేకుండా పార్టీని పటిష్టం చేయలేము

ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు

ఏఐసిసి ఇన్చార్జ్ దీపా దాస్ మున్సి

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య (జయరాజ్) మార్చి 30

ఎంపీ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని బిజెపి బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలని దేశంలోని రఘువీర్ కు నెంబర్ వన్ స్థానంలో మెజార్టీని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటామని వారి త్యాగం వృధా కాదని నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదిక దగ్గరకు ముఖ్య నాయకులు మంత్రులు విచ్చేయగ పార్టీ నాయకులు కార్యకర్తలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు సభా వేదికలో

మంత్రి ఉత్తమ్

మాట్లాడుతూ మోదీ నిరంకుశ విధానం ఈ దేశంలో కొనసాగుతుందని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని ఖూనీ చేసే విధంగా పాలన నడుస్తుందని
ఈ దేశ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని సుదీర్ఘకాలం నుండి ఇప్పుడు నిర్వహించబోయే పార్లమెంటు ఎన్నికలు గాని అంతకుముందు నిర్వహించిన ఎంపీ ఎన్నికల్లో ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా మంచి మెజార్టీతో గెలుస్తూ వస్తుందని గత ఐదేళ్లుగా పార్లమెంటు సభ్యుడుగా ఉన్నందుకు ఈ ఏడు నియోజకవర్గాల కార్యకర్తలకు నాయకులకు సేవ చేసే అదృష్టం నాకు కల్పించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఈ పార్లమెంటు పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపించామని అనేక విధాలుగా పార్లమెంటులో మన గలం వినిపించామని బిజెపిని టిఆర్ఎస్ పార్టీలను నిలదీయడం జరిగిందని ఇప్పుడు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద మెజార్టీతో గెలవబోతున్నాడని ఈ రోజు నుండి ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ను గెలిపించడం కోసం మనం సైనికుల్లా అహర్నిశలు కష్టపడాలని జిల్లాలలో నియోజకవర్గాలలో మండలాలలో గ్రామాలలో ప్రణాళికతో ముందుకు పోవాలని ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి బిజెపి అభ్యర్థి పోటీలోనే లేరని ఇద్దరికీ కూడా డిపాజిట్లు గల్లంత ఖాయమని గతంలో పార్లమెంటు పార్లమెంటు నియోజకవర్గంలో భారతదేశంలోని అతిపెద్ద సభ్యత్వ కార్యక్రమం చేసిన ఘనత మీ అందరికీ మనకు దక్కిందని ఏ విధంగా అయితే సభ్యత్వాలలో దేశంలోనే ముందంజలో ఉన్నామో ఈసారి ఎంపీ అభ్యర్థి మెజార్టీ కూడా దేశంలోనే నెంబర్ వన్ గా ఉండాలని నా అంచనా ప్రకారం ఎంపీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ మనుగడులో లేక కనుమరుగైపోతుందని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ అర్హతతో ఓట్లు అడుగుతుందో మనం గమనించాలని అన్నారు. మంత్రి కోమటి వెంకటరెడ్డి
మాట్లాడుతూ కమిషన్ల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని ఈ జనాన్ని చూస్తే రఘువీర్ గెలుపు ఎప్పుడూ అయిపోయిందని ఇక మెజార్టీని మనం చూడాలని సూర్యపేట జిల్లా నల్లగొండ జిల్లా మెజార్టీ కోసం పోటీ పడాలని ఒక్కో నియోజవర్గం నుండి లక్ష మెజార్టీ వచ్చే దిశగా కార్యకర్తలు పని చేయాలని పార్లమెంటు పరిధిలో ఆరు లక్షల మెజార్టీ దాటాలని కార్యకర్తలకు హితబోధ చేశారు.
*మాజీ మంత్రులు *జానారెడ్డి దామోదర్ రెడ్డి*

మాట్లాడుతూ
నరేంద్ర మోడీ మొన్నటికి దేశం మొత్తంలో ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తానన్నారు కానీ మొత్తం రాష్ట్రంలో కెసిఆర్ మోడీ ఇద్దరు దగా చేసారని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఆ మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు ఆగమాగం చేశారని పారిశ్రామిక రంగం దెబ్బతిన్నది వ్యవసాయ రంగం దెబ్బతిన్నది ఉద్యోగాలు రాలే రైతుల ఆదాయం పెరగలే అన్ని విధాలుగా బిజెపి ప్రభుత్వం తెలంగాణను మోసం చేసింది కాజీపేటలో రైల్వే
ఫ్యాక్టరీ గాని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ గాని ఏ ఒక్క హామీ కూడా బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేదు తెలంగాణలో వారికి ఓటు అడిగి హక్కు లేదు వారు సమాజాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ది పొందే విధంగా చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భారత దేశంలో ఇండియా కూటమి ఎన్నికల్లో గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న బిజెపి చిత్తుచిత్తుగా ఓడిపోతుందని ఇక బిఆర్ఎస్ గురించి మాట్లాడవలసిన అవసరం లేదని బిఆర్ఎస్ రాష్ట్రంలో ఇక మిగలదని దేశంలోనైనా రాష్ట్రంలోనైనా బిజెపి కాంగ్రెస్ కు మధ్య పోటీ ఉంటుందని భారత దేశంలోనే అతిపెద్ద సభ్యత్వ కార్యక్రమం నల్లగొండ పార్లమెంటు పరిధిలో జరిగిందని భారతదేశంలోనే అతి ఎక్కువ మెజార్టీ వచ్చే దిశగా నల్లగొండ నుండి ప్రయత్నం చేస్తున్నామని నల్లగొండ పార్లమెంటు పరిధిలో సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో శ్రమించి పార్టీ పటిష్టతకు కట్టుబడి ఎన్నో అవమానాలు కేసులు పెట్టిన వారు. జంకకుండా పార్టీ వైపు ఉండి గెలిపించారని వారి శ్రమ వృథా కాదని అన్నారు.

ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి

మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం నన్ను బలపరచడం ఎంతో సంతోషించదగ్గ విషయమని పెద్దలు చెప్పినట్లు నన్ను భారీ మెజార్టీతో గెలిపించటం అది మీ అందరి చేతుల్లోనే ఉందని నన్ను గెలిపిస్తే పార్టీని గెలిపించినట్లే అని నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదు అనిపించాలని నేను గెలిచాక పెద్దల సహకారంతో పార్లమెంటు స్థాయిలో ఉన్న అన్ని నియోజకవర్గాల పరిధిలోని మండలాలు గ్రామాలలో నా వంతుగా మీ అందరి సహకారంతో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని అన్నారు.

ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధులు ఏఐసిసి ఇన్చార్జి శ్రీమతి దీపా దాస్ మున్సి
మాట్లాడుతూ నేను హెలికాప్టర్లో వచ్చే క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ఉన్న సిమెంటు ఫ్యాక్టరీలను చూపించారు.

ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది సిమెంటు లేకుండా ఇంటిని ఎలా నిర్మించలేమో అదేవిధంగా కార్యకర్తలు లేకుండా పార్టీని పటిష్టం చేయలేమని నల్లగొండ జిల్లాలో మిమ్మల్ని చూస్తుంటే పార్టీ ఎంతో పటిష్టంగా ఉందని అది ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కనిపిస్తుందని మీరు చిందించిన చెమటకి పడ్డ కష్టాలకి తగ్గ ప్రతిఫలమే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మీరు ఏ విధంగానైతే ప్రతి ఒక్కరూ శ్రమించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో అదేవిధంగా నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి రఘువీర్ రెడ్డిని కూడా అలాగే భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను

బిఆర్ఎస్ బిజెపి పార్టీ మోసపూరిత మాటలు చెప్పి ఎన్నికల్లో గెద్దెనెక్కి మిమ్మల్ని మోసం చేసిన విషయం గమనించాలని బిజెపి ప్రభుత్వం గతంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అదేవిధంగా ప్రతి ఒక్కరి అకౌంట్లోకి 15 లక్షల రూపాయలు జమ చేస్తామని

కల్లబుల్లి మాటలు చెప్పి మోసం చేసిందని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుందని గడిచిన వంద రోజుల్లోనే చేసి చూపించిందని రాహుల్ గాంధీ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుంటే మీరందరూ మద్దతు తెలిపారని అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల పక్షానే పేదలకు అండగా ఉంటుందని అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జెడ్పిటిసిలు జిల్లా పరిషత్ చైర్మన్లు మండల అధ్యక్షులు పిఎసిఎస్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు కార్యకర్తలు మహిళలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!