రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత…
రెసిడెన్షియల్ పాఠశాలలో జ్యరాలు వాంతులతో విద్యార్థులు అవస్థలు
పాఠశాలకు మొక్కుబడిగా వెళ్లి వస్తున్న అధికారులు
ఆరోగ్య కేంద్రానికి నిత్యం క్యూ కడుతున్న విద్యార్థులు
పదుల సంఖ్యలో ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు
అరకొర వైద్యం చేయించి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్న పాఠశాల టీచర్లు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య సెప్టెంబర్ 25
మఠంపల్లి మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు జ్వరాలు వాంతులతో అవస్థలు పడుతున్నారు.
ఆరోగ్య కేంద్రానికి నిత్యం విద్యార్థులు క్యూ కడుతున్నారు పాఠశాల నుండి ప్రభుత్వ ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్తూ రోడ్ల వెంట పిల్లలు వాంతులు చేసుకొవడం చూసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదుల సంఖ్యలో ఆరోగ్య కేంద్రంలో పాఠశాల సిస్టర్ దగ్గరుండి రక్త పరీక్షలు చేయిస్తున్నారని పాఠశాల యాజమాన్యం అరకొర వైద్యం చేయించి తల్లిదండ్రులకు సమాచార ఇవ్వడంతో హుటాహుటిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమైందో అని పనులు పక్కన పెట్టి ఆధార బాధగా బైకులలో ఆటోలలో పాఠశాలకు వచ్చి చాలామంది తమ పిల్లలను ఇండ్లకు తీసుకు వెళ్తున్న సంఘటనలు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయని పాఠశాలలో పరిశుభ్రత పిల్లలు తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని అదే విధంగా పాఠశాలకు వివిధ కార్యక్రమాల మీద అతిథులుగా వెళ్లే అధికారులు మొక్కుబడిగా వెళ్లి రాకుండా పాఠశాలపై దృష్టి సారించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.