‘ఈ సార్ మాకొద్దు..’ పాఠశాలలో విద్యార్థుల ఆందోళన
ఖానాపూర్: చదువులు చెప్పే టీచర్ను మాకు వద్దు, బూతులు చెప్పే టీచర్, ఫోన్ చూసే టీచర్ వద్దు అంటున్న స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఇది ఎక్కడో కాదు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని గోసంపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు.
గతంలో 200 మంది విద్యార్థులకు నలుగురు టీచర్లతో సక్రమంగా నడుస్తున్న పాఠశాల కానీ ఈ సంవత్సరం ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీ పై పోవడంతో ఉన్న ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నాడు.
బదిలీపై వెళ్లిన వారి స్థానంలో కొత్తవారు రాకపోవడంతో ఉన్న ఒక ఉపాధ్యాయుడు ప్రస్తుతం ఉన్న 30 మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పె సార్ సమయానికి రాకపోవడంతో పిల్లలు వారికి వారే చదువుకుంటునట్లు స్థానికులు చెబుతున్నారు.
విద్యార్థులు మాకు చదువు చెప్పడం లేదు అంటున్నారు. బూతు మాటలు తిడుతున్నారని మమ్ముల్ని కొడుతున్నారని బడికి సార్ ఎప్పుడో వస్తారని, వస్తే ఫోన్ చూస్తూ ఉంటాడని విద్యార్థులు అంటున్నారు.
విద్యాశాఖ అధికారులు వెంటనే ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకుని ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.