5 కేజీల గంజాయి పట్టివేత…
సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునిర్.
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను సత్తుపల్లి ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. విరు ఇద్దరు యువకులు భద్రాచలం నుండి ద్విచక్ర వాహనంపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో పెనుబల్లి మండలం బయ్యనగూడెం గ్రామ శివారులో చతిస్గడ్ విజయవాడ జాతీయ రహదారిపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఈసీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తన సిబ్బందితో తనిఖీలు చేపట్టారు.
అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుండి సుమారు 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.
నిందితులు బాపట్ల కు చెందిన ఆనంద్, గుంటూరు కు చెందిన యేసు గా గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని పంచనామా నిర్వహించి రిమాండ్ కి తరలించడం జరుగుతుందని ఈసీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.