జలపాతంలో యువకుడి మృతి విషాదంగా మారిన విహారయాత్ర... సీ కే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్ ఆదివారం సెలవు దినం కావడంతో తన స్నేహితులతో సరదాగా జలపాతాల వద్ద ప్రకృతి రమణీయ దృశ్యాలను తిలకిస్తు ఎంజాయ్ చేస్తూ ఆనందంగా గడపాలని, వచ్చిన మిత్రబృందంలో ఒక యువకుడు, ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జలపాతం లో మునిగి మృతి చెందాడు ఈ విషాదకర సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ములుగు …

జలపాతంలో యువకుడి మృతి
విషాదంగా మారిన విహారయాత్ర...
సీ కే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్
ఆదివారం సెలవు దినం కావడంతో తన స్నేహితులతో సరదాగా జలపాతాల వద్ద ప్రకృతి రమణీయ దృశ్యాలను తిలకిస్తు ఎంజాయ్ చేస్తూ ఆనందంగా గడపాలని, వచ్చిన మిత్రబృందంలో ఒక యువకుడు, ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జలపాతం లో మునిగి మృతి చెందాడు ఈ విషాదకర సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి..
ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో అనేక జలపాతాలు ప్రకృతి రమణీయ దృశ్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి .అయితే నీటి ప్రమాదాలు జరుగుతుండడంతో, రాష్ట్ర ప్రభుత్వం, ములుగు జిల్లా అధికారులు అటవీశాఖ, వెంకటాపురం, వాజేడు మండలంలోని అనేక జలపాతాలు కు పర్యాటకుల సందర్శనను నిషేధించింది.
కేవలం తెలంగాణ నయాగారగా పేరుగాంచిన బొగత జలపాతం ను ములుగు జిల్లా అధికార యంత్రాంగం అటవీశాఖ పర్యటకులకు అనుమతి ఇచ్చింది. అయితే వాజేడు మండలంలోని కొంగాల జతపాతం ను పర్యటకులకు, సందర్శనలు ప్రభుత్వం నిషేధించింది.
ఈ మేర కు జగన్నాధపురం వద్ద అటవీ శాఖ సిబ్బందితో కొంగాల వెళ్ళే రోడ్డును మూసివేసి చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేశారు. వేరే దొంగ మార్గం గుండా కొంతమంది స్థానికుల సహాయంతో, అడవి మార్గం గుండా ఆదివారం గోదావరిఖని పట్టణ ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు దొడ్డిదారిన కొంగాల జలపాతం చేరుకున్నారు.
జలపాతం లో బి.అభినవ్ (18 సంవత్సరాలు) అనే ఇంజనీరింగ్ విద్యార్థి తాడిచెట్టు లోతు జల ప్రమాణంలో ఉన్న జలపాతం లో స్నానానికి , దిగి ఈత రాక మునిగి పోయాడు. సమాచారం తెలుసుకున్న వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్, అటవీశాఖ సిబ్బంది గజ ఈతగాళ్ళు తో జలపాతం మడుగులో గాలించారు.
ఇంజనీరింగ్ విద్యార్థి అభినవ్ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు వెలికి తీశారు. సమాచారం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు విహారయాత్ర కని వెళ్లి విగత జీవుగా మారాడని నిండు నూరేళ్లు నిండిపోయాయని, మృతదేహంపై కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ ఉండడం సూపరులను కంటి తడి పెట్టించింది .
ఈ మేరకు వాజేడు ఎస్.ఐ.రుద్రహరీష్ కేసు నమోదు చేసి విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ. మీడియా తెలిపారు.
అనుమతి లేని జలపాతాల వద్దకు ఎవరు వెళ్ళవద్దని, హెచ్చరికలు జారీ చేస్తున్న దొంగ మార్గంలో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, జలపాతాల వద్దకు వెళ్ళవద్దని, ఈ సందర్భంగా పోలీసు , అటవీ శాఖ అధికారులు పర్యాటకులను కోరారు.
