గ్రూప్ 1 అభ్యర్థులకు అలెర్ట్… ఎగ్జామ్ డేట్, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా👇
తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21నుంచి 27వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు నిర్వహించనున్నారు.పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల 14నుంచి జారీ చేయనున్నట్లుగా టీజీపీఎస్సీ ప్రకటించింది.
ఇప్పటికే పరీక్షల సమయంలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలను ఉల్లంఘించవద్దని స్పష్టం చేసింది.
ఇక గ్రూప్ 1 మెయిన్స్ కు మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.
అభ్యంతరాల స్వీకరణ తర్వాత ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించారు. గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ అనుసరించి గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు.
జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ పేపర్) పరీక్ష – అక్టోబర్ 21న జరుగనుంది. పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22న, పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) – అక్టోబర్ 23న, పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) – అక్టోబర్ 24న, పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) – అక్టోబర్ 25న నిర్వహిస్తారు. పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) – అక్టోబ్ 26న, పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) – అక్టోబర్ 27ను ఉంటుంది.
మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లీష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్ 1 పరీక్షలు రద్దు కావటంతో అభ్యర్థులు ఒత్తిడికి లోనయ్యారు.