
యూరియా కోసం బ్రాండ్ మేళాలతో రైతులుప్రధాన రహదారిపై నిరసన
సీకే న్యూస్ చింతకాని ప్రతినిధి. జి పిచ్చయ్య
చింతకాని మండలం జగన్నాధపురం రైతు వేదిక వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది. మండలంలో యూరియా పంపిణీ విషయంలో రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు
సోమవారం ఉదయం జగన్నాధపురం రైతు వేదిక లో యూరియాపంపిణీ చేస్తున్నారని విషయం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో రైతు వేదిక వద్దకు చేరుకున్నారు యూరియాకొరత నుంచి రైతులకు ఉపశమనం కలిగించేలా ఖమ్మం బోనకల్లు ప్రధాన రహదారి పై బ్యాండ్ మేళాలతో నిరసన తెలిపారు
రహదారిపై కొద్దిసేపు భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు విషయం తెలుసుకొని చింతకాని ఎస్ఐ వీరేందర్ రైతు వేదిక వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడి రైతులను శాంతింప జేశారు
అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు మధిరవ్యవసాయ అధికారి విజయ్ చంద్ర చింతకాని వ్యవసాయ అధికారి మానస రైతులతో మాట్లాడి యూరియా పంపిణీ చేశారు