మాజీ మంత్రి హరీష్ రావు బంధువులపై కేసు నమోదు...! బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు బంధువులపై కేసు నమోదైంది. హరీష్‌రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, ఫాస్మో కంపెనీపైనా మియాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మియాపూర్‌లో దండు లచ్చిరాజు అనే వ్యక్తికి చెందిన ఐదంతస్తుల ప్రాపర్టీని తన్నీరు గౌతం, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, …

మాజీ మంత్రి హరీష్ రావు బంధువులపై కేసు నమోదు...!

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు బంధువులపై కేసు నమోదైంది. హరీష్‌రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, ఫాస్మో కంపెనీపైనా మియాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళితే.. మియాపూర్‌లో దండు లచ్చిరాజు అనే వ్యక్తికి చెందిన ఐదంతస్తుల ప్రాపర్టీని తన్నీరు గౌతం, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావులు కబ్జా చేసినట్లు సమాచారం.

ఇటీవల లచ్చిరాజకు తెలియకుండానే ఆ ఇంటిని అమ్మేశారని.. బ్లాంక్‌ చెక్‌, బ్లాంక్‌ ప్రామిసరీ నోటుతో తనను చీట్ చేశారని లచ్చిరాజు మియాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

అంతేకాదు.. తనకు వ్యతిరేకంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తన ఆస్తి కోసం లచ్చిరాజు 2019 నుంచి పోరాడుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 18 Oct 2024 9:29 AM IST
cknews1122

cknews1122

Next Story