
‘లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ AO’
ఫర్టిలైజర్ షాప్ అనుమతుల కోసం మండల వ్యవసాయ అధికారి రూ.50 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన వికారాబాద్ జిల్లా, మోమిన్ పెట్ మండలంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మోమిన్ పెట్ మండలంలో ఫర్టిలైజర్ షాప్ అనుమతుల కోసం ఓ వ్యక్తి మండల వ్యవసాయ అధికారి భూపతి జయశంకర్ ను సంప్రదించగా, రూ.1 లక్ష లంచం ఇస్తేనే అనుమతులు ఇస్తానని చెప్పడంతో, సదురు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బుధవారం పక్కా ప్లాన్ ప్రకారం వ్యవసాయ అధికారికి రూ. 50,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సంఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.