భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలుడి వింత ప్రవర్తన.. బాలుడికి పూనిన శివుడు.. అక్కడ శివలింగం ఉందని వాక్కు.. వెళ్లి తవ్వకాలు జరపగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కమలాపురంలో అశోక్ అనే బాలుడు వింత ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత మూడు నెలలుగా తనకు తాను శివ స్వరూపంగా చెప్పుకుంటూ వింతగా ప్రవర్తిస్తున్నాడు.తన రూపమైన శివలింగం భూమిలో ఆరడుగుల లోతులో ఉందంటూ దానిని బయటకు తీయాలంటూ చెప్తున్నాడు. ఇదే విషయంపై గత కొంతకాలంగా చర్చించిన …

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలుడి వింత ప్రవర్తన..

బాలుడికి పూనిన శివుడు.. అక్కడ శివలింగం ఉందని వాక్కు.. వెళ్లి తవ్వకాలు జరపగా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కమలాపురంలో అశోక్ అనే బాలుడు వింత ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గత మూడు నెలలుగా తనకు తాను శివ స్వరూపంగా చెప్పుకుంటూ వింతగా ప్రవర్తిస్తున్నాడు.తన రూపమైన శివలింగం భూమిలో ఆరడుగుల లోతులో ఉందంటూ దానిని బయటకు తీయాలంటూ చెప్తున్నాడు.

ఇదే విషయంపై గత కొంతకాలంగా చర్చించిన గ్రామంలోని పెద్ద మనుషులు.. మంగళవారం రోజున తవ్వకాలు జరిపారు. ఆరడుగుల లోతు తీసినా ఎటువంటి విగ్రహం బయటపడకపోవడంతో చిన్నబోవాల్సిన పరిస్థితి వచ్చింది.

బాలుడు చెబుతున్న ప్రదేశం పూర్తిగా అటవీ ప్రాంతం. గతంలో ఇక్కడ పోడు నరికి నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించగా అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు.

బాలుడు చూపించిన ప్రదేశం కూడా గతంలో వారు ఆక్రమించిన స్థలం పక్కనే ఉండడం గమనార్హం. అటవీ భూమిని ఆక్రమించుకునేందుకే దేవుడు పేరుతో ఇలా డ్రామాలు చేస్తున్నారంటూ అటవీశాఖ అధికారులు చెప్తున్నారు.

Updated On 6 Nov 2024 4:11 PM IST
cknews1122

cknews1122

Next Story