కోదాడలో మహిళ గొంతు కోసిన ఆర్ఎంపీ డాక్టర్ కోదాడలో మహిళపై ఆర్ఎంపీ డాక్టర్ దాడి చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్ఎంపీ డాక్టర్, మహిళకు కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆర్ఎంపీ మహిళ గొంతు కోశాడు. ఇంట్లో ఉన్న రేణుక అనే మహిళని విచక్షణ రహితంగా కోసి పరారయ్యాడు. కాగా రేణుక కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చి రక్తపు మడుగులో ఉన్న రేణుకను కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ఆమె పరిస్థితి …

కోదాడలో మహిళ గొంతు కోసిన ఆర్ఎంపీ డాక్టర్
కోదాడలో మహిళపై ఆర్ఎంపీ డాక్టర్ దాడి చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్ఎంపీ డాక్టర్, మహిళకు కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆర్ఎంపీ మహిళ గొంతు కోశాడు.
ఇంట్లో ఉన్న రేణుక అనే మహిళని విచక్షణ రహితంగా కోసి పరారయ్యాడు. కాగా రేణుక కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చి రక్తపు మడుగులో ఉన్న రేణుకను కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు.
ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో..సూర్యాపేట ఏరియా హాస్పిటల్ తరలించినట్లు స్థానికులు తెలిపారు. దాడికి కారణాలు తెలువ లేదు. కాగా రేణుక భర్త సతీష్ బైక్ మెకానిక్ పని చేస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయంపై కోదాడ టౌన్ ఎస్సై సైదులు వివరణ అడగ్గా నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
