లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై, రైటర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై, రైటర్ Web desc : స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ.10 వేల లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్సై అరుణ్‌తోపాటు పోలీస్ కానిస్టేబుల్ (రైటర్) రామస్వామి గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు.నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై గతంలో స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై డబ్బులు డిమాండ్ చేశాడు. …
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై, రైటర్
Web desc : స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ.10 వేల లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్సై అరుణ్‌తోపాటు పోలీస్ కానిస్టేబుల్ (రైటర్) రామస్వామి గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు.నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు.
లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై గతంలో స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై డబ్బులు డిమాండ్ చేశాడు. లంచడం ఇవ్వడానికి ఇష్టపడని సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ప్లాన్ ప్రకారం.. గురువారం మధ్యాహ్నం లంచం ఇచ్చేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. ఎస్సై అరుణ్ సూచన మేరకు స్టేషన్ రైటర్ రామస్వామి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఎస్సై, కానిస్టేబుల్‌ను హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు.