HyderabadPoliticalTelangana

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు భారీ ఊరట

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు భారీ ఊరట

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు భారీ ఊరట

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు

స్పీకరే నిర్ణయమే ఫైనల్…

పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలకతీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్), తెల్లం వెంకటరావు( భద్రాచలం)పై అనర్హత విధించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది.
అనర్హత విషయంలో నెలరోజుల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది.

ఈ తీర్పుపై అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక అంశాలతో కూడిన తీర్పును వెలువరించింది.

అనర్హత నిర్ణయం తీసుకుంటే ఎన్ని రోజుల్లో తీసుకోవాలి అనేది అసెంబ్లీ స్పీకర్ విచక్షణాధికారం అని.. ఇందుకు ఇంత టైం అంటూ ఏమీ లేదంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్ణత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేసిన.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. పై విధంగా తీర్పు వెల్లడించింది.

ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి సమయం.. గడువు లేదని.. టైం బాండ్ అంటూ లేదంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది హైకోర్టు బెంచ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button