50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఈ
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పంచాయతీరాజ్ ఏఈ పాండురంగారావు 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ లో ఏఈగా పనిచేస్తున్న పాండురంగారావు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ కృష్ణయ్య గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం…
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని రాజశ్రీ గార్లపాడు గ్రామంలో రూ.35 లక్షల నిధులతో మైనార్టీ కమిటీ హాల్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తయ్యి ఆరు నెలలు గడుస్తున్నా బిల్లులు కాకపోవడంతో…
పంచాయతీరాజ్ ఏఈ పాండురంగారావుని కాంట్రాక్టర్లు మహ్మద్ హుస్సేన్, జగదీశ్వర్ రెడ్డి, లాలు లక్ష్మీనారాయణలు ఎన్నోసార్లు బతిమాలారు. బిల్లులు చేయాలంటే లక్ష రూపాయలు ఇస్తే తప్ప చేయనని పాండురంగా రావు మొండికేశాడు.
చేసేదేమీ లేక బిల్లుల కోసం రూ.50,000 ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.ఆ తర్వాత ఏసీబీ అధికారులకు ముందస్తు సమాచారం అందించారు.
దీంతో యథావిధిగా పాండు రంగారావుకి కాంట్రాక్టర్లు ఫోన్ చేసి రూ.50,000 ఎక్కడ ఇవ్వాలని అడిగారు. ఎర్రవల్లి చౌరస్తాలో ఒక షాపునందు ఇవ్వాలని చెప్పాడు. ప్లాన్ చేసిన కాంట్రాక్టర్లు పాండు రంగారావుకు రూ.50000 ఇస్తుండగా ఏసీబీ అధికారు లు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు.