బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు..
హైదరాబాద్ లో బిర్యానీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ యువకుడు. నేరేడ్మెట్ గ్రీన్ బావర్చి హాటల్లో మంగళవారం రవి అనే యువకుడు చికెన్ బిర్యానీ తిన్నాడు.
మంగళవారం గ్రీన్ బావర్చిలో బిర్యానీ తిన్న యువకుడు ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే విపరీతంగా వాంతులు చేసుకోగా కుటుంబ సభ్యులు అతడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
బిర్యానీ తిన్న తర్వాతే ఫుడ్ పాయిజన్అయినట్లు వైద్యుల ద్వారా తెలియడంతో సదరు యువకుడు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఎక్స్‌లో ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదుపై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు గ్రీన్ బావర్చి రెస్టారెంట్లో తనిఖీలు చేశారు. బిర్యానీలో సింథటిక్ కలర్స్వాడుతున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు. హోటళ్లలోని ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు టెస్టులకు పంపించారు.