లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ
అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలి
పీఎంజేఎఫ్ లయన్ రేపాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బొల్లికొండ
సికే న్యూస్ ప్రతినిధి
ఖమ్మం, నవంబర్ 21: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించాలని పి ఎం జె ఎఫ్ లయన్ రేపాల మదన్మోహన్, లయన్స్ క్లబ్ ఖమ్మం అధ్యక్షులు డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావులు అన్నారు. గురువారం కూసుమంచి, చేగొమ్మ గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఒక్కో పాఠశాల విద్యార్థులకు పదివేల రూపాయలు విలువచేసే స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.
యువజన సాధికారిక జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ విద్యార్థుల అభ్యున్నతి కాంక్షిస్తూ చేగమ్మ కూసుమంచి పాఠశాలల విద్యార్థులకు ఒక్కో పాఠశాలకు పదివేల రూపాయలు విలువ చేసి రెండు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి గెల్లా శ్రీరామ్, పిడీజి పీఎంజేఎఫ్ లయన్ మోతుకూరి మురళీధర్, లయన్ డాక్టర్ డి పి సి రావు, విశ్వేశ్వరరావు, దుర్గా నాగేశ్వరరావు, వి వెంకయ్య, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు డి విక్రమ్ రెడ్డి, టి చంద్రశేఖర్, పిడిఎస్ రాజు, బి పాపారావు తదితరులు పాల్గొన్నారు