గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఇంజన్ అపహరణ నల్గొండ జిల్లా వేములపల్లి గ్రామపంచాయతీకి సంబంధించి నటువంటి ట్రాక్టర్ ఇంజన్ ను సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్టు గ్రామపంచాయతీ సిబ్బంది తెలిపారు ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది మాట్లాడుతూ ప్రతిరోజు గ్రామ పంచాయతీ విధులకు ట్రాక్టర్ ని ఉపయోగించిన అనంతరం పంచాయతీ కార్యాలయం ముందు ట్రాక్టర్ ఇంజన్ ను నిలుపుతామని అదేవిధంగా సోమవారం విధుల అనంతరం సాయంత్రం వేళలో నిలిపామని మంగళవారం ఉదయం తమ విధులకు హాజరై చూడగా ట్రాక్టర్ …
గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఇంజన్ అపహరణ
నల్గొండ జిల్లా వేములపల్లి గ్రామపంచాయతీకి సంబంధించి నటువంటి ట్రాక్టర్ ఇంజన్ ను సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్టు గ్రామపంచాయతీ సిబ్బంది తెలిపారు
ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది మాట్లాడుతూ ప్రతిరోజు గ్రామ పంచాయతీ విధులకు ట్రాక్టర్ ని ఉపయోగించిన అనంతరం పంచాయతీ కార్యాలయం ముందు ట్రాక్టర్ ఇంజన్ ను నిలుపుతామని అదేవిధంగా సోమవారం విధుల అనంతరం సాయంత్రం వేళలో నిలిపామని మంగళవారం ఉదయం తమ విధులకు హాజరై చూడగా ట్రాక్టర్ ఇంజన్ లేకపోవడంతో తోటి సిబ్బందిని ఆరా తీయడంతో ఎవరికి తెలవదు అనడంతో ఇంజన్ ని ఎవరో అపహరించారని గుర్తించిన పంచాయతీ సిబ్బంది వెంటనే వేములపల్లి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది