బి.ఆర్.ఎస్ నేతల అక్రమ అరెస్టుల పై ములుగు జిల్లా బి.ఆర్.ఎస్ నాయకుల ఆగ్రహం
“తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు బి.ఆర్.ఎస్ పార్టీ”
“ప్రజా సమస్యల గుర్చి ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీ నాయకులపై దొంగ కేసులు నమోదు”
“ప్రజా పాలన పేరుతో ప్రజలకు టోపీ పెట్టె మీ ప్రయత్నాన్ని బి.ఆర్.ఎస్ పార్టీ అడ్డుకుంటుంది.”
“తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయని వారి పైనేనా.! మీ అక్రమ కేసులు.”
“ములుగు జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి”
“ములుగు జిల్లా సికే న్యూస్ ప్రతినిధి భార్గవ్”
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ ప్రచారంలో ఎండమవులు లాంటి పథకాలను ప్రజలకు ఎరగా చూపి నూతనంగా అధికారాన్ని అధిష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏడాది పాలనలో పథకాలను సరిగ్గా ప్రజలకు అందించకపోగా, తెలంగాణ రాష్ట్ర పాలనను సకాలంలో అభివృద్ధి బాటలో పెట్టలేని పాలకులు..
వారి పాలన అసమర్ధతను ప్రజల్లో ఒప్పుకోలేక అవగాహన లేని పథకాలను, అక్కరికి రాణి హామీలను ఇస్తూ బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని కుంటినడక నడిపిస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ పాలకులపై ప్రజలలో వ్యతిరేకత మొదలైంది..; అనే విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రజల ఆలోచనను ప్రతిపక్ష పార్టీ నాయకుల పై తప్పుడు కేసులు పెట్టి ప్రజల ఆలోచన శైలిని తిప్పాలని చేసే ప్రయత్నమే ఈ బి.ఆర్.ఎస్ పార్టీ ప్రముఖ నాయకుల అక్రమ అరెస్టులు..
తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఉన్నటువంటి సమస్యల గూర్చి పూర్తి అవగాహనతో పాలించిన బి.ఆర్.ఎస్ పదేళ్ల సుదీర్ఘ పాలన ప్రజలు ఎరిగినవారే” ప్రస్తుత ప్రభుత్వం
తెలంగాణ ప్రజలకు కావలసిన సకల సౌకర్యాలను కల్పించాల్సింది పోయి.. అవగాహన లేని పథకాలను ప్రచురింపజేసి తెలంగాణ ప్రజలను అయోమయంలో పడేశారు..
బి.ఆర్.ఎస్ సుదీర్ఘ పాలనలో ప్రజలకు కావలసిన అవసరాలను వారి అక్కరలను ఎరిగి ఒక్కొక్కటిగా నీరు, నివాస గృహాలు, వ్యవసాయ పోడు భూములు, బిసి,ఎస్సీ, ఎస్టి,చేయూత పథకాలు, రైతుబంధు, దళిత బంధు, ఇలాంటి మరెన్నో మహోన్నతమైన అద్భుత సువర్ణ పథకాలను తెచ్చి, ప్రజ సమస్యలకు శాశ్వత పరిష్కారం తెచ్చే భాగంలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ చూడని విధంగా, ఏ పార్టీ చేయలేని పనులను సాధించింది
బి.ఆర్.ఎస్ పార్టీ ఆ విషయం మీకు జీర్ణం కాకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే” ఒక్క బి.ఆర్.ఎస్ పార్టీయే” అనే విషయం జగమెరిగిన సత్యమే..! అధికార ప్రభుత్వానికి ఒక న్యాయం ప్రతిపక్షం పార్టీకి ఒక న్యాయమా.? ఎండమావులు లాంటి తెలంగాణలో లేని అభివృద్ధి పనుల గూర్చి బహిరంగ సభలో మీరు మాట్లాడాలి అంటేనేమో మీకు పోలీస్ ప్రొటెక్షన్…? ఉన్న ప్రజల ప్రస్తుత సమస్యల గురించి ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీ నాయకులు నిలదీస్తే” వాళ్లకు జైలు శిక్షణ…? ప్రజల వేలుతో ప్రజల కంటిని పోడవాలని చూసే మీ కుట్ర రాజకీయాలకు చెక్ పెట్టే రోజులు తొందరలోనే ఉన్నాయి..
కాంగ్రెస్ పార్టీ హయామ్ లో అభివృద్ధి జరుగుతుందో.! “లేక” అభివృద్ధి తెలంగాణలో అడుగంటుతుందో.! అన్ని ప్రజలే చూస్తున్నారు.. ఏ మార్పు కోసం మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మార్పు కోసం ఓటు వేసిన ప్రజలు.. మీ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపి, బి.ఆర్.ఎస్ జెండాను ఇంటికి కట్టి ఆహ్వానించే గడియలు దగ్గర్లోనే ఉన్నాయి..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కావాలి మార్పు రావాలి అనే నినాదంతో మరల బొట్టు పెట్టి బి.ఆర్.ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టే రోజు కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.. ఇకనైనా మీ బుద్ధి మార్చుకొని ప్రతిపక్ష పార్టీల వెనుక గోతులు తీయడం మానేసి మిగిలిన పాలన సమయాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం…