ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్‌!.. ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల ర్యాగింగ్‌ తాళలేక ఆరో తరగతి విద్యార్థి(12) ఒకరు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి బంధువులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశ్రమ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు పనులు చేయాలంటూ ఆరో తరగతి విద్యార్థిని తరచూ వేధిస్తూ కొడుతుండే వారు. ఆ బాధను …

ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్‌!.. ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల ర్యాగింగ్‌ తాళలేక ఆరో తరగతి విద్యార్థి(12) ఒకరు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి బంధువులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశ్రమ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు పనులు చేయాలంటూ ఆరో తరగతి విద్యార్థిని తరచూ వేధిస్తూ కొడుతుండే వారు. ఆ బాధను తట్టుకోలేక ఆ విద్యార్థి ఎలర్జీ నివారణకు వాడే ఔషధం తాగాడు.

గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం బాలుడికి చికిత్స అందిస్తున్నామని, 24 గంటల తర్వాత ఆరోగ్య పరిస్థితి చెబుతామని వైద్యులు తెలిపారు. పదో తరగతి విద్యార్థులు వేధిస్తున్న విషయం వార్డెనుకు తెలిపినా పట్టించుకోలేదని బాధిత విద్యార్థి తెలిపాడు.

ఈ విషయమై గిరిజనాభివృద్ధి శాఖ ఉపసంచాలకుడు మాలోత్‌ సైదానాయక్‌ను వివరణ కోరగా.. గూడూరు గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని గూడూరు ఎస్‌ఐ గిరిధర్‌రెడ్డి తెలిపారు. వార్డెన్‌ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.

Updated On 8 Dec 2024 10:45 PM IST
cknews1122

cknews1122

Next Story