పరారీ లో మంచు మోహన్ బాబు మంచు మోహన్‌బాబు(Manchu Mohan Babu) పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడి ఘటనలో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఈకేసులో తనకు ముందస్తు బెయిల్(Anticipatory Bail) మంజూరు చేయాలని, తదుపరి దర్యాప్తు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్ట్.. అభ్యర్థనను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు …
![పరారీ లో మంచు మోహన్ బాబు పరారీ లో మంచు మోహన్ బాబు](https://cknewstv.in/wp-content/uploads/2024/12/n643125774173401165539169248f74083c3d47817371ecf9f84ed1c923020301bd7c11fea0c8b8b8e609a9.jpg)
పరారీ లో మంచు మోహన్ బాబు
మంచు మోహన్‌బాబు(Manchu Mohan Babu) పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడి ఘటనలో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే.
కాగా ఈకేసులో తనకు ముందస్తు బెయిల్(Anticipatory Bail) మంజూరు చేయాలని, తదుపరి దర్యాప్తు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్ట్.. అభ్యర్థనను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళగా..
ఆయన ఇంట్లో లేరు. పరారీలో ఉన్న మోహన్‌బాబు కోసం 5 చోట్ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఎక్కడా ఆయన ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. కాగా మూడు రోజుల క్రితం మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఫ్యామిలీ వివాదం, కేసుల నేపథ్యంలో న్యూస్ కవర్ చేసేందుకు మోహన్ బాబు ఇంటి వద్దకు వెళ్లిన కొందరు జర్నలిస్టులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిడుతూ, లోగోలు లాక్కుని దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు అయింది.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)