PoliticalTelangana

మద్యం మత్తులో పోకిరీలు హల్‌చల్

మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్….

మద్యం మత్తులో పోకిరీలు హల్‌చల్ సృష్టించి అటవీ శాఖ అధికారిపై దాడికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా పరిధిలోని దండేపల్లి మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ప్రతిరోజూ లాగే తపాలపూర్ గ్రామం శివారులో చెక్‌పోస్ట్ వద్ద సాయి కుమార్ అనే ఎఫ్‌బీవో వాహనాల తనిఖీ చేపడుతున్నాడు.

ఈ క్రమంలోనే బాగా మద్యం సేవించిన నలుగురు చెక్‌పోస్ట్ దాటేందుకు ప్రయత్నించారు. అయితే, వారి వాహనాన్ని ఎఫ్‌బీవో సాయి అడ్డుకోవడంతో అక్కడే వివాదం రాజుకుంది. అదును చూసి ఆ నలుగురు పోకిరీలు అటవీ అధికారిపై దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో తీవ్రమైన గాయాలైన సాయికుమార్‌ను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన నలుగురిని పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button