తంజావూరు బృహదీశ్వరాలయాన్ని దర్శించుకున్న తుళ్లూరు బ్రహ్మయ్య, కొప్పుల చంద్రశేఖర్
ఖమ్మం: తమిళనాడులోని తంజావూరు లో గల ప్రాచీన బృహదీశ్వర ఆలయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులకు కొప్పుల చంద్రశేఖర్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో.. కొలువై ఉన్న బృహదీశ్వరుడు( శివుడు)కు ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన.. ఈ దేవాలయాన్ని సందర్శించడం, స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆ మహా శివుడిని కోరుకున్నట్లు వారు తెలిపారు.