శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన మహిళా అభిమాని రేవతి కుటుంబాన్ని తాను కలవలేకపోతున్నానని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ కుటుంబాన్ని నేరుగా కలిసి వారికి అండగా నిలవలేకపోతున్నానని తెలిపారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. స్పృహ కోల్పోయి చికిత్స …

శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన మహిళా అభిమాని రేవతి కుటుంబాన్ని తాను కలవలేకపోతున్నానని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ కుటుంబాన్ని నేరుగా కలిసి వారికి అండగా నిలవలేకపోతున్నానని తెలిపారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు.

స్పృహ కోల్పోయి చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్యం గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను అని అల్లు అర్జున్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు.

ప్రస్తుతం ఈ అంశంపై కేసులు కొనసాగుతున్నాయి. లీగల్ ప్రొసీడింగ్స్ కారణంగా తాను రేవతి కుటుంబాన్ని నేరుగా కలవకూడదని లాయర్లు సూచించారని తెలిపారు.

కొన్ని చట్టపరమైన కారణాలతో బాధిత కుటుంబాన్ని నేరుగా కలిసి పరామర్శించలేకపోయాను. కానీ వారికి అవసరమైన మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి బాధ్యత తీసుకున్నట్లు తెలిపారు.

శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని, వీలైనంత త్వరగా ఆ కుటుంబాన్ని కలుసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఆదుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అల్లు అర్జున్ ఆ పోస్టులో రాసుకొచ్చారు.

Updated On 15 Dec 2024 10:25 PM IST
cknews1122

cknews1122

Next Story