నారాయణ స్కూల్‌లో దారుణం.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
రాష్ట్రంలో విద్యార్థుల వరుస అత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.మొన్నటికి మొన్న నగర పరిధిలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా..
తాజాగా, హయత్ నగర్ (Hayathnagar) పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నారాయణ పాఠశాల (Narayana School)లో ఏడో తరగతి చదువుతోన్న లోహిత్ (Lohith) సోమవారం రాత్రి హస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గమనించిన స్కూల్ సిబ్బంది లోహిత్‌ను ఆసుపత్రికి తరలించగా..
అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అనంతరం హుటాహుటిన పాఠశాలకు వద్దకు చేరుకున్న లోహిత్ కుటుంబ సభ్యులకు, బంధువు అక్కడున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాలంటూ స్కూల్ ఎదుటే బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హస్టల్ వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.