రేపు.. ఖమ్మంలో నిర్వహించే కాంగ్రెస్ ర్యాలీకి పార్టీ నాయకులకు, శ్రేణులకు ఆహ్వానం
- ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పిలుపు
ఖమ్మం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పై ఇటీవల పార్లమెంట్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా.. కాంగ్రెస్ ఖమ్మం జిల్లా కమిటీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, శ్రేణులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ( సంజీవరెడ్డి భవన్) నుంచి జెడ్పీ సెంటర్ వరకు జరిగే నిరసన ర్యాలీకి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాల్సిoదిగా కోరారు. అనంతరం నూతన కలెక్టరేట్ లో వినతిపత్రం సమర్పించే.. కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిదిగా కోరారు. ఈ మేరకు ఎంపీ రఘురాం రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన వెలువడింది.