Andhra Pradesh

అప్పుల బాధతో రైతు ఆత్మ*హత్యాయత్నం

అప్పుల బాధతో రైతు ఆత్మ*హత్యాయత్నం

అప్పుల బాధతో రైతు ఆత్మ*హత్యాయత్నం

Web desc : అప్పుల బాధతో రైతు పురుగుల నివారణ మందు తాగి ఆత్మ*హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం రామసముద్రం మండలంలో చోటు చేసుకుంది.

ఘటనపై బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని అరికెల పంచాయతీ పేడరాసుపల్లికి చెందిన మునిస్వామి కుమారుడు రైతు ఆర్‌.నారాయణ(59) వ్యవసాయ పంటల సాగుకోసం సుమారు ఏడు లక్షల అప్పులు చేశాడు.

టమాటాలు, ఇత్తర కూరగాయల పంటలను పండించారు. ప్రస్తుతం టమాటాలకు ధరలు తగ్గిపోవడంతో పంటలకు గిట్టు బాటు లేక తీవ్రంగా నష్టం చవిచూడాల్సి వచ్చింది.

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు తన వ్యవసాయ బోరు వద్దకు వెళ్లి పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్సల అనంతరం అతని పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు. ఘటనపై రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button