వైద్యం వికటించి నాలుగు రోజుల పసిబిడ్డ మృతి… వికారాబాద్ గవర్నమెంట్​ హాస్పిటల్​లో ఇన్​టైంలో వైద్యం అందక నాలుగు రోజుల పసి బాలుడు మృతి చెందాడు. వికారాబాద్​జిల్లా నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లికి చెందిన భిక్షపతి, స్వప్న దంపతులు. నాలుగు రోజుల కిందట వికారాబాద్ దవాఖానలో స్వప్న మగబిడ్డ జన్మనిచ్చింది. ఆ సమయంలో తల్లీబిడ్డల ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే, ఆదివారం అర్ధరాత్రి బాబుకు ఎక్కిళ్లు రావడంతో ఒకసారి వచ్చి చూడాలని నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ …

వైద్యం వికటించి నాలుగు రోజుల పసిబిడ్డ మృతి…

వికారాబాద్ గవర్నమెంట్​ హాస్పిటల్​లో ఇన్​టైంలో వైద్యం అందక నాలుగు రోజుల పసి బాలుడు మృతి చెందాడు. వికారాబాద్​జిల్లా నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లికి చెందిన భిక్షపతి, స్వప్న దంపతులు. నాలుగు రోజుల కిందట వికారాబాద్ దవాఖానలో స్వప్న మగబిడ్డ జన్మనిచ్చింది.

ఆ సమయంలో తల్లీబిడ్డల ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే, ఆదివారం అర్ధరాత్రి బాబుకు ఎక్కిళ్లు రావడంతో ఒకసారి వచ్చి చూడాలని నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ అశోక్​వద్దకు వెళ్లారు.

దవాఖానలో ఆయన అందుబాటులో లేకపోవడంతో ఫోన్​లో సంప్రదించారు. ఎన్నిసార్లు ఫోన్​చేసినా లిప్ట్​చేయకపోవడంతో నైట్​డ్యూటీలో ఉన్న నర్సులు వారికి తెలిసిన ట్రీట్మెంట్ అందించారు.

అనంతరం ఉదయం నాలుగున్నర గంటలకు నైట్ డ్యూటీ డాక్టర్​అశోక్​ వచ్చి బాలుడికి వైద్య పరీక్షలు(సీఆర్ పీ) చేసి మృతి చెందినట్లు నిర్ధారించారు.

దీంతో సకాలంలో వైద్యం అందకపోవడంతోనే తమ బిడ్డ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నైట్ డ్యూటీ డాక్టర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

వికారాబాద్​డీఎస్పీ శ్రీనివాస్​రెడ్డి, సీఐ భీమ్​కుమార్, ఎస్ఐ భీమ్ ​కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో డాక్టర్​అశోక్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీ

ఈ ఘటనపై విచారణ చేయాలని ముగ్గురు ప్రొఫెసర్లు డాక్టర్​శిరీష, డాక్టర్​సంగీత లక్ష్మి, డాక్టర్​శ్రావణ్​తో కమిటీ వేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్​డాక్టర్​ రాంచంద్రయ్య సోమవారం తెలిపారు.

ప్రొఫెసర్ల నివేదిక అందజేసిన తర్వాత డాక్టర్ అశోక్ ​పై చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ​కూడా విచారణ చేస్తుందని తెలిపారు.

Updated On 7 Jan 2025 4:28 PM IST
cknews1122

cknews1122

Next Story