ఎగ్జామ్ లేకుండానే పోలీస్ ఉద్యోగం.. నోటిఫికేషన్ విడుదల..
ఎగ్జామ్ లేకుండానే పోలీస్ ఉద్యోగం.. నోటిఫికేషన్ విడుదల.. నిరుద్యోగులకు శుభవార్త.ఉద్యోగానికి సెలక్ట్ అయ్యేందుకు కోసం కోచింగ్‌ల చుట్టూ తిరగక్కర్లేదు. ఎగ్జామ్ కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేకుండా పోలీస్ ఉద్యోగం అందుకునే అవకాశం. తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్ లేకుండానే పోలీస్ ఉద్యోగం పొందవచ్చు. హైదరాబాద్ సిటీ పోలీస్‌లో ప్రత్యేక పోలీసు అధికారులుగా విధులు నిర్వర్తించే అవకాశం అందుకోవచ్చు. పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన నియామాకాలు జరిగే ఈ ఉద్యోగం …
ఎగ్జామ్ లేకుండానే పోలీస్ ఉద్యోగం.. నోటిఫికేషన్ విడుదల..
నిరుద్యోగులకు శుభవార్త.ఉద్యోగానికి సెలక్ట్ అయ్యేందుకు కోసం కోచింగ్‌ల చుట్టూ తిరగక్కర్లేదు. ఎగ్జామ్ కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేకుండా పోలీస్ ఉద్యోగం అందుకునే అవకాశం.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్ లేకుండానే పోలీస్ ఉద్యోగం పొందవచ్చు. హైదరాబాద్ సిటీ పోలీస్‌లో ప్రత్యేక పోలీసు అధికారులుగా విధులు నిర్వర్తించే అవకాశం అందుకోవచ్చు.
పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన నియామాకాలు జరిగే ఈ ఉద్యోగం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
నెలకు రూ.24 వేల వేతనంతో కూడిన పోలీసు ఉద్యోగాలకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అభ్యర్థుల అర్హత, వయస్సు, గడువు తేదీ, కావాలసిన పత్రాలు, వేతన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ కింది అర్హత కలిగి ఉండాలి.
మాజీ సైనికుడు లేదా మాజీ పారామిలిటరీ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారికే ప్రాధాన్యత.
రిటైర్డ్ పోలీసు తెలంగాణలోనే నివసిస్తున్నట్లు రుజువులు చూపించాలి. (ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్)
మాజీ సైనికుల వయస్సు 01-01-2025 నాటికి 58 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. మాజీ పారామిలిటరీ, రిటైర్డ్ పోలీసు సిబ్బందిగా రెండేళ్ల లోపు సర్వీస్‌తో పదవీ విరమణ చేసి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 61 సంవత్సరాలు.
నెలకు గౌరవ వేతనం రూ.24000/- మరియు సెలవు అర్హత లేదు. వేతనం చెల్లింపు లేకుండా అవసరమైతే సెలవులు మంజూరు.
కింది పత్రాలు ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీ కలిగి ఉండాలి:
ఎక్స్ సర్వీస్‌మెన్ డిశ్చార్జి బుక్ లేదా సి.ఏ.పి.పి. డిశ్చార్జ్ సర్టిఫికేట్ మరియు ఆర్.పి.పి. రిటైర్మెంట్ ఆర్డర్.
ఆధార్ కార్డు మరియు పాన్‌కార్డు
టెక్నికల్ గ్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ కలిగిన మాజీ సైనికుడు లేదా మాజీ పారామిలిటరీ.
డ్రైవర్ అభ్యర్థులకు మాత్రమే చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్
పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
ఆసక్తిగల అభ్యర్థులందరూ Spos ఆఫీస్, CAR హెడ్‌క్వార్టర్స్ పెట్లబుర్జ్ హైదరాబాద్‌ని సందర్శించి దరఖాస్తు సమర్పించాలి. ఫోన్ కాల్స్ అంగీకరించబడవు.
గమనిక: దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 25-01-2025 సాయంత్రం 5గం.లకు మూసివేయబడును.