ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్... హైదరాబాద్: గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్‌లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అరుంధతినగర్‌లో పర్యటించారు. ఇటీవల రెవెన్యూ అధికారులు అరుంధతినగర్‌లో కూలగొట్టిన ఇళ్లను పరిశీలించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కూల గొట్టడమే అజేండాగా పెట్టుకుందని …

ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్...

హైదరాబాద్: గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్‌లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు.

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అరుంధతినగర్‌లో పర్యటించారు. ఇటీవల రెవెన్యూ అధికారులు అరుంధతినగర్‌లో కూలగొట్టిన ఇళ్లను పరిశీలించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కూల గొట్టడమే అజేండాగా పెట్టుకుందని అరోపించారు.

జవహర్‌నగర్‌లో పేదకుటుంబాలే నివాసం ఉంటున్నాయని ఇక్కడ కూల్చిన రేకుల షెడ్లకు రూ.50 వేలు, స్లాబ్‌లకు రూ,2 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో పెద్దవాళ్లు కోట్లాది విలువైన భూములను కొల్లగొడుతుంటే పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం జవహర్‌నగర్‌ లోని పేదలపై మాత్రం తమ ప్రతాపాన్ని చూపుతున్నారని విమర్శించారు.

రెవెన్యూ అధికారులపై మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. ఇప్పటికైనా పేదల జోలికి రాకుండా ఉండాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా రూరల్‌ అధ్యక్షులు విక్రంరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్‌, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మహేందర్‌యాదవ్‌, కార్పొరేటర్‌ పానుగంటి బాబు, నాయకులు రంగుల శంకర్‌, జవహర్‌నగర్‌ పార్టీ అధ్యక్షులు కమల్‌, సంతోష్‌, సందీప్‌, యాదగిరి, అరుంధతి వాసులు పాల్గొన్నారు..

Updated On 20 Jan 2025 1:22 PM IST
cknews1122

cknews1122

Next Story