KhammamPoliticalTelangana

లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి

లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి

లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి

ఇల్లందు : ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులతో ఇల్లందు పట్టణానికి చెందిన లోద్ సంతోష్ (21) శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లోద్ సంతోష్ ఆన్ లైన్ లోన్ యాప్ ల ద్వారా 90 వేల రూపాయలు లోన్ తీసుకున్నాడన్నారు. నెలవారీగా కడుతూ 48 వేల వరకు లోన్ క్లియర్ చేశాడని తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో లోన్ కట్టకపోయాడన్నారు.

దీంతో యాప్ నిర్వాహకులు నిత్యం ఫోన్లు చేస్తూ వేధించడం మొదలుపెట్టారన్నారు. లోన్ కట్టకపోతే కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి తెలిసిన వారందరికీ పంపుతామని బెదిరించారన్నారు.

తన వల్ల తన కుటుంబం పరువు పోతుందని బాధతో శుక్రవారం రాత్రి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు.

అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button