పొలంలో ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి.. మంగపేట : పంట పొలాల్లో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ ప్రశాంత్ (25) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మొట్లగూడెంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన రవి అనే కలప వ్యాపారి నరేందర్ రావుపేటకు చెందిన తాటి సమ్మయ్య వద్ద జామాయిల్ కర్ర కొనుగోలు చేశాడు. అనంతరం రవి ట్రాక్టర్ తో కలపను భద్రాచలం పేపర్ బోర్డు కంపెనీ (బీజీపీపీఎల్)కు …

పొలంలో ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి..

మంగపేట : పంట పొలాల్లో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ ప్రశాంత్ (25) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మొట్లగూడెంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన రవి అనే కలప వ్యాపారి నరేందర్ రావుపేటకు చెందిన తాటి సమ్మయ్య వద్ద జామాయిల్ కర్ర కొనుగోలు చేశాడు.

అనంతరం రవి ట్రాక్టర్ తో కలపను భద్రాచలం పేపర్ బోర్డు కంపెనీ (బీజీపీపీఎల్)కు తరలిస్తున్న క్రమంలో టాక్రర్ మొట్లగూడెం బ్రిడ్జీ సమీపంలో బోల్తా పడినట్లు తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి శవాన్ని ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 20 Jan 2025 2:36 PM IST
cknews1122

cknews1122

Next Story