ప్రభుత్వ పాఠశాలకు ఐడిబీఐ బ్యాంకు చేయూత... ప్రభుత్వ పాఠశాల జి.ప.ఉ.పా శెట్టిపాలెం కు ఐడిబీఐ బ్యాంకు మిర్యాలగూడ వారి చేయూత సీకే న్యూస్ వేములపల్లి జనవరి 29 వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కు ఐడిబీఐ బ్యాంకు మిర్యాలగూడ పట్టణ శాఖ సుమారు లక్షా యాభై వేల రూపాయల విలువ గల ముప్పై ఐదు డ్యూయల్ డెస్క్ బెంచీలను కొనుగోలు చేయుటకు ఆర్ధిక సహకారాన్ని చెక్కు రూపం లో 29/01/2025 …

ప్రభుత్వ పాఠశాలకు ఐడిబీఐ బ్యాంకు చేయూత...

ప్రభుత్వ పాఠశాల జి.ప.ఉ.పా శెట్టిపాలెం కు ఐడిబీఐ బ్యాంకు మిర్యాలగూడ వారి చేయూత

సీకే న్యూస్ వేములపల్లి జనవరి 29

వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కు ఐడిబీఐ బ్యాంకు మిర్యాలగూడ పట్టణ శాఖ సుమారు లక్షా యాభై వేల రూపాయల విలువ గల ముప్పై ఐదు డ్యూయల్ డెస్క్ బెంచీలను కొనుగోలు చేయుటకు ఆర్ధిక సహకారాన్ని చెక్కు రూపం లో 29/01/2025 నాడు పాఠశాల లో జరిగిన ఒక కార్యక్రమం లో ఐడిబీఐ బ్యాంక్ రిజినల్ కో ఆర్డినేటర్ రవికాంత్ శెట్టి అంగడి ఐడిబీఐ మిర్యాలగూడ బ్రాంచ్ హెడ్ వీ.సూర్య అన్నపూర్ణేశ్ మంచికంటి, సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ కాటం నాగరాజు మరియు ఐడిబీఐ మిర్యాలగూడ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్
రమేష్ బొడ్డుపల్లి చేతులమీదుగా ప్రధానోపాధ్యాయులు నీలం సత్యనారాయణ కు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వేములపల్లి ఎమ్ఈవో భూక్యా లక్ష్మణ్ నాయక్ పాల్గొని ఐడిబీఐ బాంకు వారి చేయూత ను ప్రశంసించి,దానిని సద్వినియోగం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు మరియు విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు.పాఠశాలకు ఆర్థిక సహకారం అందించిన ఐడిబిఐ బాంకు వారిని అభినందించారు.

ఇట్టి కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు
నీలం సత్యనారాయణతో పాటూ ఉపాధ్యాయులు ఎంవెంకటరెడ్డి, తిరుపతి, సతీష్ రెడ్డి, డిరాజశేఖర్, డి.హేమ, రషీదా బేగం, ఎం.సుమన్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Updated On 29 Jan 2025 8:56 AM IST
cknews1122

cknews1122

Next Story