తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగి హల్చల్! తెలంగాణ సెక్రటేరియట్ (Telangana Secretariat)లో నకిలీ ఉద్యోగి(Fake Employee)ఉదంతం వెలుగుచూసింది. ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్న వైనాన్ని సెక్రటేరియట్ భద్రతా విభాగం ఎస్పీఎఫ్(SPF) పోలీసులు గుర్తించి అతని ఆట కట్టించారు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. పూర్తి ఆధారాలు సేకరించాక ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ …

తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగి హల్చల్!

తెలంగాణ సెక్రటేరియట్ (Telangana Secretariat)లో నకిలీ ఉద్యోగి(Fake Employee)ఉదంతం వెలుగుచూసింది. ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్న వైనాన్ని సెక్రటేరియట్ భద్రతా విభాగం ఎస్పీఎఫ్(SPF) పోలీసులు గుర్తించి అతని ఆట కట్టించారు.

నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. పూర్తి ఆధారాలు సేకరించాక ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్,హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు నకిలీ ఉద్యోగి భాస్కర్ రావును చాకచక్యంగా పట్టుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన రోజునే భాస్కర్ రావును ఎస్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. భాస్కర్ రావుకు మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి. ప్రశాంత్ కారు డ్రైవర్ రవి ఫేక్ ఐడీ కార్డు తయారు చేయించినట్లుగా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ గా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్న భాస్కర్ రావు తో పాటు అతనికి సహకరించిన డ్రైవర్ రవిని ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి ఏ1గా భాస్కర్ రావు..ఏ2 గా డ్రైవర్ రవిపై ఎఫ్ ఐఆర్ చేశారు.

నిందితులు ఇద్ధరు సెక్రటేరియట్ లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసున్నట్లు ఆరోపణలున్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు నిందితులు ఏమేమి అక్రమాలు చేశారన్న వివరాలతో పాటు..ఎవరినైనా ఫేక్ ఐడీ చూపి ఆర్థికంగా మోసం చేశారా అన్న వివరాలపై విచారిస్తున్నారు. అలాగే వారి వెనుక సెక్రటేరియట్ లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా..? వారికి ఎవరు సహకరించారు.. వారి బాధితులు ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలోనే ఈ రకమైన నకిలీ ఉద్యోగి వ్యవహారం వెలుగు చూడటంతో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి.

Updated On 30 Jan 2025 2:01 PM IST
cknews1122

cknews1122

Next Story