HealthHyderabadPoliticalTelangana

బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత?

బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత?

బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కు తీవ్ర అస్వస్థత?

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, గురువారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థ తకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.

మాగంటి గోపీనాథ్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు సమా చారం. ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.

వైద్యు బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది.ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు.

వారు గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, మాగంటి గోపీనాథ్‌కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button