
రాసలీలలకు అడ్డాగా వరంగల్ ‘కార్పొరేషన్’..
ఎక్కడా ప్లేస్ దొరకడం లేదనుకున్నారో.. ఆఫీసు అయితే ఎవరూ చూడరనుకున్నారో గానీ, వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు రాసక్రీడలకు తెగబడ్డారు.
ముద్దులతో ఒకరినొకరు మైకంలో మునిగిపోయారు. ఈ బాగోతాన్ని ఎవరో ఒకరు వీడియో తీసి.. సోషల్‌మీడియాలో పెట్టడంతో సెల్‌ఫోన్లలో తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, ఈ విషయం ఉన్నతాధికారుల వరకు కూడా వెళ్లినట్లు సమాచారం.
కొత్తగా బల్దియాకు ఇటీవల జూనియర్ అకౌంటెంట్లు వచ్చారు. అందులో ఐనవోలు మండలానికి చెందిన ఉద్యోగి, సిరిసిల్లకు చెందిన మహిళా ఉద్యోగిని మధ్య అప్పుడే ప్రేమాయణం మొదలైనట్లు ఆఫీసులో కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ ప్రేమాయణం కాస్త కామాయణానికి దారి తీసి.. ఆఫీసులోనే హద్దులు మీరేలా చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. కాగా, మహిళా ఉద్యోగికి పెళ్లయినట్లు సమాచారం. వేచి చూడాలి ఎం జరుగుతుందో…