HealthHyderabadPoliticalTelangana

మాజీ మంత్రి హరీష్‌రావుకు అస్వస్థత - కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స

మాజీ మంత్రి హరీష్‌రావుకు అస్వస్థత - కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స

మాజీ మంత్రి హరీష్‌రావుకు అస్వస్థత – కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.

ఆయనకు తీవ్ర జ్వరంతో పాటు క్షీణించిన ఆరోగ్యం కారణంగా బేగంపేట కిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

ఈ ఘటన, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో చోటుచేసుకుంది.

సమావేశం మధ్యలో హరీష్ రావు అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.

వైద్యుల ప్రకారం, హరీష్ రావుకు ప్రస్తుతం హై ఫీవర్ ఉన్నా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. పూర్తి మెడికల్ టెస్టులు జరిపిన తర్వాత పూర్తి స్థాయి ఆరోగ్య నివేదిక అందించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button